సింగరేణి సైరెన్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:33 AM

ప్రాణాలకు తెగించి సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టం వెండితెరపైకి ఎక్కనుంది. ‘జార్జిరెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన జీవన్‌రెడ్డి కథను అందిస్తున్నారు...

సింగరేణి సైరెన్‌

ప్రాణాలకు తెగించి సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టం వెండితెరపైకి ఎక్కనుంది. ‘జార్జిరెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన జీవన్‌రెడ్డి కథను అందిస్తున్నారు. ధూమ్ర వారాహి బేనర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ ఇనుగుర్తి దర్శకుడు. ఈ చిత్రం టైటిల్‌ను యూనిట్‌ ఆదివారం వెల్లడించింది. ‘సింగరేణి జంగ్‌ సైరన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 1999లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సర్వైవల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తామని యూనిట్‌ తెలిపింది. ఇతర వివరాలను మేడే రోజున వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి. సినిమాటోగ్రఫీ: రాఖీ వన మాలి.

Updated Date - Apr 22 , 2024 | 04:33 AM