మైనర్‌గా ఉన్నప్పటి నుంచే.. కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు
ABN , Publish Date - Sep 18 , 2024 | 04:55 AM
నృత్య దర్శకుడు జానీ తనపై చేసిన లైంగిక వేధింపుల గురించి బాధితురాలు చేసిన ఫిర్యాదుపై నార్సింగ్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి విచారణ చేపెట్టారు. అలాగే టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్...
దీనిపై విచారణ జరుపుతున్నాం.. కొన్ని ఆధారాలు దొరికాయి
90 రోజుల్లో నివేదిక: టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్
నృత్య దర్శకుడు జానీ తనపై చేసిన లైంగిక వేధింపుల గురించి బాధితురాలు చేసిన ఫిర్యాదుపై నార్సింగ్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి విచారణ చేపెట్టారు. అలాగే టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ మంగళవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ ఫ్యానెల్ ఛైర్‌పర్సన్, నటి ఝాన్సీ, తమ్మారెడ్డి భరద్వాజ దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ ‘ఇద్దరు ప్రముఖ కొరియోగ్రాఫర్స్ మధ్య ఉన్న మేటర్ ఇది. చిత్ర పరిశ్రమ అనేది అన్ ఆర్గనైజ్‌డ్ సెక్టార్. మహిళల రక్షణ కోసం ఇక్కడ సరైన గైడ్‌లైన్స్ లేవు. డిఫరెంట్ వింగ్స్‌లో పరిశ్రమ పని చేస్తుంది కాబట్టి ఏ రకమైన గైడ్ లైన్స్ ఉండాలనేది ప్రభుత్వంతోచర్చించాలి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేదింపులు లేవు అని మేం చెప్పడం లేదు.ఇతర భాషల పరిశ్రమలో ఉన్న సమస్యలు, సెక్సువల్ హరా్‌సమెంట్ ఇక్కడ కూడా ఉంది, ఇద్దరు కొరియోగ్రాఫర్ల మధ్య జరిగిన వ్యవహారం ఇది. వాళ్ల పేర్లు బయట పెట్టదలచుకోలేదు ఒక హయ్యర్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి మీద ఆరోపణ వచ్చింది. బాధితురాలు మైనర్‌గా ఉన్న దగ్గర నుంచి పని చేస్తోంది. ఆమె మొదట మీడియా ఛానల్స్‌సు ఎప్రోచ్ అయింది.
ఇది మీడియాలో వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కనుక నువ్వు ఛాంబర్‌కు వెళ్లమని మీడియా వారు భరద్వాజ దగ్గరకి, సుప్రియ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చారు. పరిశ్రమలో నాకు వర్క్ కావాలి అని ఆమె ఛాంబర్ ముందు వచ్చింది. పని ఇస్తామని చెప్పి వేధిస్తున్నారని వచ్చింది. ఫెడరేషన్ ద్వారా ఛాంబర్ ఆమెకి కార్డు ఇప్పించింది. అయితే కార్డు ఇవ్వడం వెనుక సెక్సువల్ హరా్‌సమెంట్ ఉందనే విషయం ఆమెతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది. అయితే సెక్సువల్ హరాస్‌మెంట్ అనేది వర్క్ ప్లేస్‌లో కాదని తెలిసింది. ఆమె కంప్లయింట్ రికార్డ్ చేశాం. ఆ కొరియాగ్రాఫర్ స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశాం. లీగల్‌గా, మెడికల్‌గా పోలీసుల సాయం తీసుకోవడానికి భూమిక అనే ఎన్జీఓ సపోర్ట్‌గా నిలిచింది. వర్క్ పేరుతో ఆ మైనర్ యువతి మీద వేధింపులు జరిగాయి. దీని మీద ఎంక్వయిరీ జరుగుతోంది. ఆదారాలు కొన్ని దొరికాయి. గైడ్‌లైన్స్ ప్రకారం మాకు 90 రోజుల గడువు ఉంది. దానిలోపే పని పూర్తి చేసి రిపోర్ట్ ఇస్తాం.
వర్క్ ప్లేస్‌లో మహిళలకు భద్రత కల్పించాలనీ, ఇది సురక్షిత ప్రదేశమని నిరూపించాలని మా తపన.’ అని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘ఇలాంటి కేసుల కోసమే 2013లో ‘ఆసరా’ ఏర్పాటు చేశాం. 2018లో ఈ ప్యానెల్ పెట్టాం. పరిశ్రమలో మహిళలు సేఫ్‌గా ఉంటారని చెప్పడానికే ఈ ప్రెస్‌మీట్ పెట్టాం’ అన్నారు.
బాధితురాలికి పరిశ్రమ భరోసా
ఈ కేసు తర్వాత ఈ ఫిమేల్ కొరియోగ్రాఫర్ తన పని ప్రశాంతంగా చేసుకోగలగాలి. దీని వల్ల తన జీవితం నాశనం అయిపోతుంది, వచ్చే అవకాశాలు పోతాయి. పరిశ్రమ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది.. అనే భయం ఆమెకి ఉండకూడదు. ఆ అమ్మాయి టాలెంట్ పరిశ్రమకు తెలుసు. ఈ కేసు ఎటువైపు వెళ్లినా ఆమె టాలెంట్‌కు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆమెకు చిత్ర పరిశ్రమ సపోర్ట్‌గా నిలబడింది. కొంతమంది నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె టాలెంట్ తెలిసిన పెద్ద సంస్థ, దర్శకుడు అవకాశం ఇస్తున్నారు. ఒక పెద్ద హీరో తన మేనేజర్ ద్వారా కబురు చేసి ఆమెకు మద్దతు పలికారు. టాలెంట్‌కు పరిశ్రమ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది
ఝాన్సీ