శింబు థగ్‌ లైఫ్‌

ABN , Publish Date - May 09 , 2024 | 06:25 AM

సూపర్‌హిట్‌ చిత్రం ‘విక్రమ్‌’ తర్వాత కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘థగ్‌ లైఫ్‌’. మణిరత్నం దర్శకుడు. ‘నాయకుడు’ తర్వాత ఆయన కమల్‌హాసన్‌తో...

శింబు థగ్‌ లైఫ్‌

సూపర్‌హిట్‌ చిత్రం ‘విక్రమ్‌’ తర్వాత కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘థగ్‌ లైఫ్‌’. మణిరత్నం దర్శకుడు. ‘నాయకుడు’ తర్వాత ఆయన కమల్‌హాసన్‌తో చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తమిళ హీరో శింబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ, చిత్రబృందం బుధవారం టీజర్‌ను విడుదల చేసింది. శింబు కారుతో దూసుకొచ్చి తుపాకీ గురిపెట్టిన తీరు ఆకట్టుకుంది. ఆర్‌ మహేంద్రన్‌ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్‌

Updated Date - May 09 , 2024 | 06:25 AM