Siddhu Jonnalagadda: టిల్లు గాడు బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్నాడుగా !

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:03 AM

సిద్దు జొన్నలగడ్డ సినిమా 'టిల్లు స్క్వేర్' ఐదు రోజులకు గాను రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నారు. త్వరలో వందకోట్ల క్లబ్బులోకి చేరి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాడు

Siddhu Jonnalagadda: టిల్లు గాడు బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్నాడుగా !
A still from Tillu Square

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమా గత శుక్రవారం విడుదలైంది ఈరోజుకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. సిద్దు జోనల్లగడ్డ టిల్లు గా ప్రేక్షకులని 'డీజీ టిల్లు' తో రెండు సంవత్సరాల క్రితం అలరిస్తే ఈసారి ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ 'టిల్లు స్క్వేర్' మొదటి సినిమా కన్నా ఎక్కువ వినోదం ఇవ్వటమే కాకుండా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాకి ఎన్నో రేట్లు డబ్బులు తెస్తోంది కూడా.

tillusquare4.jpg

ఈ సినిమా విడుదలైన రోజు నిర్మాత వంశీ ఈ సినిమా వందకోట్లు చేస్తుందని అనుకుంటున్నాం అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న ప్రేక్షక ఆదరణ చూస్తుంటే రూ. వందకోట్లు దగ్గర ఆగిపోయే సినిమాకాదు, ఇంకా ఎక్కువ చేస్తుంది అనిపిస్తోంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

tillusquarerecords.jpg

ఈరోజు ఈ చిత్ర నిర్వాహకులు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం ఐదు రోజులకు గాను 'టిల్లు స్క్వేర్' రూ.85 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని చెపుతున్నారు. అంటే ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా వందకోట్ల క్లబ్బులో చేరిపోతుంది. సిద్దు జొన్నలగడ్డ అనే నటుడి సినిమా ఇలా వందకోట్ల క్లబ్బులోకి ఇంత తొందరగా చేరడం నిజంగా పరిశ్రమలో అందరికీ ఆశ్చర్యమే. సినిమాలో విషయం ఉండాలి గానీ, ప్రేక్షకుల ఆ సినిమాకి బ్రహ్మరధం పడతారు అనేదానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అని అంటున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:03 AM