సిద్దార్థ్‌ 40వ చిత్రం

ABN , Publish Date - May 19 , 2024 | 06:33 AM

తెలుగు, తమిళ భాషల్లో మంచి నటుడుగా గుర్తింపు పొందిన సిద్దార్థ్‌ తన తాజా చిత్రం వివరాలు వెల్లడించారు. ఇది ఆయనకు 40వ చిత్రం కావడం విశేషం...

సిద్దార్థ్‌ 40వ చిత్రం

తెలుగు, తమిళ భాషల్లో మంచి నటుడుగా గుర్తింపు పొందిన సిద్దార్థ్‌ తన తాజా చిత్రం వివరాలు వెల్లడించారు. ఇది ఆయనకు 40వ చిత్రం కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి శ్రీగణేశ్‌ దర్శకత్వం వహించనున్నారు. అరుణ్‌ విశ్వ నిర్మాత. ఈ సినిమా గురించి సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ‘ఈ మధ్య నేను చాలా కథలు విన్నా. శ్రీగణేశ్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. మంచి నిర్మాత అరుణ్‌ విశ్వతో పని చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘నేను స్ర్కిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నప్పుడు యూత్‌తో పాటు పరిణితి కలిగిన నటుడు కావాలనుకున్నాను. అప్పుడే సిద్దార్థ్‌ గుర్తుకు వచ్చారు. ఆయన కథ విని మెచ్చుకుని, కొన్ని సూచనలు కూడా ఇచ్చారు’ అని దర్శకుడు గణేశ్‌ చెప్పారు. ‘శాంతి టాకీస్‌ అని మా అమ్మ పేరు బేనరుకు పెట్టాం. ఆవిడ థియేటర్‌లో చూసి ఆనందించే సినిమాలే తీస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే కమర్షియల్‌ చిత్రాలు తీస్తాను. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని నిర్మాత అరుణ్‌ విశ్వ చెప్పారు.

Updated Date - May 19 , 2024 | 06:33 AM