ప్రియురాలిని పెళ్లాడుతున్న సిద్థార్థ్‌ మాల్యా

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:18 AM

వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తనయుడు, నటుడు సిద్ధార్థ్‌ మాల్యా పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తన ప్రియురాలు జాస్మిన్‌ను సిద్థార్థ్‌ లండన్‌లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళాడనున్నారు...

ప్రియురాలిని పెళ్లాడుతున్న సిద్థార్థ్‌ మాల్యా

వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తనయుడు, నటుడు సిద్ధార్థ్‌ మాల్యా పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తన ప్రియురాలు జాస్మిన్‌ను సిద్థార్థ్‌ లండన్‌లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళాడనున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో వారిద్దరూ కలసి తెల్లకోటు, తెల్ల గౌను వేసుకుని పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన ఓ ఫొటోను పోస్ట్‌ చేసి ‘‘పెళ్లికి సమయం ఆసన్నమైంది. వేడుకలు మొదలయ్యాయి’’ అని ఆయన పేర్కొన్నారు. జాస్మిన్‌కు గతేడాది నవంబరులో తన ప్రేమను వ్యక్తపరిచిన సందర్భాన్ని.. ఇద్దరూ కలసి నిశ్చితార్థపు ఉంగరాన్ని ధరించిన ఫొటోలను సిద్ధార్థ్‌ మాల్యా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం గురించి అందరికీ తెలిసింది.

Updated Date - Jun 19 , 2024 | 09:33 AM