ఒక్కటైన సిద్ధార్థ్‌, అదితి

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:02 AM

హీరో సిద్దార్ధ్‌, హీరోయిన్‌ అదితీరావు హైదరీల వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథస్వామి ఆలయంలో బుధవారం ఉదయం జరిగింది. తమిళనాడు నుంచి వచ్చిన పురోహితులు వివాహ తంతును జరిపించారు...

ఒక్కటైన సిద్ధార్థ్‌, అదితి

హీరో సిద్దార్ధ్‌, హీరోయిన్‌ అదితీరావు హైదరీల వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథస్వామి ఆలయంలో బుధవారం ఉదయం జరిగింది. తమిళనాడు నుంచి వచ్చిన పురోహితులు వివాహ తంతును జరిపించారు. వివాహ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు స్థానిక పూజారులను కానీ, ఆలయ సిబ్బంది, స్థానికులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. అనుమతించిన కొద్దిమంది సెల్‌ఫోన్లను కూడా తీసుకున్నారు. వివాహ కార్యక్రమం పూర్తయిన వెంటనే వనపర్తి పట్టణంలోని వాసుదేవమ్మ తోటలో విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ తోట వనపర్తి సంస్థానాదీశులది. అదితీరావు హైదరీ వనపర్తి సంస్థానాదీశుల్లో చివరిరాజుగా ఉన్న రామేశ్వర్‌రావు మనమరాలు. ఆయన కూతురు విద్యారావు సంతానం అదితి. వనపర్తి సంస్థానాదీశుల కాలంలో నిర్మించిన శ్రీరంగాపూర్‌ రంగనాథ స్వామి ఆలయం ఇప్పటికీ సంస్థానాదీశుల ట్రస్టు ఆధీనంలోనే ఉండడంతో పెళ్లితంతును రహస్యంగా నిర్వహించగలిగారని చెప్పవచ్చు. హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అదితిరావు హైదరీ కలసి ‘మహాసముద్రం’ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది. సిద్ధార్థ్‌, అదితి ఇద్దరికీ ఇది రెండో వివాహం. సిద్ధార్థ్‌ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను 2003లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2007లో ఇద్దరి మధ్యలో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అదితి 2002లో సత్యదీప్‌ మిశ్రాను పెళ్లి చేసుకొని, 2012లో విడిపోయారు.

మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 28 , 2024 | 01:02 AM