బిల్లు నేనే చెల్లించేదాన్ని

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:35 AM

‘మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండటం ఎంతో ముఖ్యం. ఆర్థిక విషయాల్లో ఇతరులపై ఆధారపడటం నాకు నచ్చదు. ఎప్పుడైనా ఎవరితోనైనా డేట్‌కి వెళ్తే...బిల్లు నేనే

‘మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండటం ఎంతో ముఖ్యం. ఆర్థిక విషయాల్లో ఇతరులపై ఆధారపడటం నాకు నచ్చదు. ఎప్పుడైనా ఎవరితోనైనా డేట్‌కి వెళ్తే...బిల్లు నేనే చెల్లించేదాన్ని’ అని అన్నారు శ్రుతిహాసన్‌. కొందరు అబ్బాయిలు ఖర్చులన్నీ తనతోనే పెట్టించేవారని ఓ పాడ్‌కా్‌స్టలో చెప్పారు. ‘మొదట్లో ఎదుటి వ్యక్తిని అడగకుండానే నేను అన్నింటికీ డబ్బులు చెల్లించేదాన్ని. కొంత కాలం తర్వాత ఎప్పుడైనా ఈ విషయాన్ని అడిగితే..నువ్వు ఇష్టపడి కడుతున్నావేమో అనుకున్నామని అంటారు. ఇలాంటి అనుభవాలు ఎదురైన తర్వాత డబ్బుల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండాలని అర్థం చేసుకున్నా’ అని శ్రుతిహాసన్‌ చెప్పారు.

Updated Date - Oct 19 , 2024 | 06:35 AM