ప్రేమ, పెళ్లి గొప్పతనాన్ని చాటేలా...

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:45 AM

సుమన్‌తేజ్‌, గరిమ చౌహాన్‌ జంటగా నటించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీశ్‌ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాచాల యుగంధర్‌ నిర్మించారు...

ప్రేమ, పెళ్లి గొప్పతనాన్ని చాటేలా...

సుమన్‌తేజ్‌, గరిమ చౌహాన్‌ జంటగా నటించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీశ్‌ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాచాల యుగంధర్‌ నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం థియేటర్లో అందర్నీ ఆకట్టుకుంటూ.. హిట్‌ టాక్‌లో దూసుకుపోతోంది. ప్రేమ, పెళ్లి గొప్పతనాన్ని చాటేలా ఉన్న చిత్ర కథాంశం యూత్‌ను, ఫ్యామిలీని విపరీతంగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో గగన్‌ విహారి, నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. చిత్రానికి ఎడిటర్‌: వెంకటప్రభు, కెమెరామెన్‌: పరశురామ్‌, సంగీతం: చరణ్‌అర్జున్‌

Updated Date - Jun 25 , 2024 | 12:45 AM