మహిళ విజయం వెనుక మగాడు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:07 AM

కిరణ్‌కుమార్‌, భవ్యశ్రీ జంటగా నటించే ‘దీక్ష’ చిత్రం షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఽఅధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు తూముకుంట

మహిళ విజయం వెనుక మగాడు

కిరణ్‌కుమార్‌, భవ్యశ్రీ జంటగా నటించే ‘దీక్ష’ చిత్రం షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఽఅధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, ఆర్‌.కె. గౌడ్‌ తొలి క్లాప్‌ ఇచ్చారు. యోగానంద కృష్ణమాచార్య తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘దీక్ష, పట్టుదల ఉంటే ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తాం అనే పాయింట్‌తో ఈ సినిమా తీస్తున్నాం. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటారు. అలాగే ఒక మహిళ విజయం వెనుక కూడా మగాడు ఉంటాడు. ఈ అంశం కూడా చిత్రకథలో ఉంది. మంచి కథాబలం ఉన్న సినిమా కనుక అవార్డులు కూడా వస్తాయని అనుకుంటున్నాం. మే ఒకటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్‌, దుబాయ్‌లో ఒక షెడ్యూల్‌ చేస్తున్నాం. పాటల రికార్డింగ్‌ పూర్తయింది. దీని తర్వాత స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రా్‌పలో ఒక సినిమా చేస్తున్నాం. ఇక పై మా బేనరుపై వరుసగా సినిమాలు తీస్తాం’ అని చెప్పారు.

Updated Date - Apr 27 , 2024 | 12:07 AM