ఉత్కంఠ భరితంగా శివం భజే

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:38 AM

యువ నటుడు అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌, తమిళ విలన్‌ సాయి ధీనా, హైపర్‌ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు...

ఉత్కంఠ భరితంగా  శివం భజే

యువ నటుడు అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌, తమిళ విలన్‌ సాయి ధీనా, హైపర్‌ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అప్సర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్వర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి ‘శివం భజే’ అనే టైటిల్‌ను మంగళవారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘’అశ్విన్‌ హీరోగా ఒక వైవిధ్యమైన కథతో గంగా ఎంటర్టైన్మెంట్స్‌ మొదటి నిర్మాణంగా ‘శివం భజే’ తెరకెక్కుతోంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్‌ సినిమా ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తయింది’’ అని అన్నారు. దర్శకుడు అప్సర్‌ మాట్లాడుతూ ‘‘సాంకేతికంగా ఉన్నతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ : ఛోటా కె ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : సాహి సురేష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ : వికాస్‌ బడిస, డిఓపీ : దాశరథి శివేంద్ర.

Updated Date - Mar 13 , 2024 | 03:38 AM