శివగాడు యమాస్పీడ్
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:32 AM
నటుడు సుమన్ ముఖ్య పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘శివగాడు యమాస్పీడ్’. శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు...
నటుడు సుమన్ ముఖ్య పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘శివగాడు యమాస్పీడ్’. శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా మోసాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజేందర్, రవిశంకర్, పొట్టి ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని శివ చెప్పారు. సినిమాటోగ్రఫీ: ఏఎస్ రత్నం.