ప్రతీ విషయంలో కంట్రోల్‌ చేసేది

ABN , Publish Date - Oct 04 , 2024 | 01:12 AM

తమిళ నటుడు జయం రవి ఇటీవలే తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విడాకులకు గల కారణాల్ని ఆయన తాజాగా ఓ యూట్యూబర్‌తో మాట్లాడుతూ...

తమిళ నటుడు జయం రవి ఇటీవలే తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విడాకులకు గల కారణాల్ని ఆయన తాజాగా ఓ యూట్యూబర్‌తో మాట్లాడుతూ బయటపెట్టారు. ‘‘నా భార్య నాకు కనీస గౌరవం ఇచ్చేది కాదు. ఎప్పుడూ నన్ను కంట్రోల్‌ చేయాలనుకునేది. ఏదైనా అవసరం వచ్చి ఏటీఎమ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినా.. ఆమె వెంటనే కాల్‌ చేసి అడిగేది. తను మాత్రం షాపింగ్‌ అంటూ వందల కొద్దీ బ్యాగులు.. బట్టలు కొని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసేది. నా ఖర్చులపై మాత్రం నిఘా పెట్టేది. నాపై అనుమానంతో నా అసిస్టెంట్లను కూడా ఖర్చుల విషయాలు అడిగేది. అసలు నాకు ఏ విషయంలోనూ స్వేచ్చ ఉండేది కాదు. ఇంటి నుంచి షూటింగ్‌ వరకూ ప్రతీ విషయంలో నాకు అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి’’ అని చెప్పారు.

Updated Date - Oct 04 , 2024 | 01:12 AM