వచ్చే సంక్రాంతికి శతమానం భవతి సీక్వెల్‌

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:11 AM

వచ్చే సంక్రాంతికి కోసం పన్నెండు నెలలు ముందుగానే బెర్త్‌ రిజర్స్‌ చేసుకున్నారు నిర్మాత దిల్‌ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనరుపై 2017లో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ‘శతమానం భవతి’ చిత్రాన్ని....

వచ్చే సంక్రాంతికి శతమానం భవతి సీక్వెల్‌

వచ్చే సంక్రాంతికి కోసం పన్నెండు నెలలు ముందుగానే బెర్త్‌ రిజర్స్‌ చేసుకున్నారు నిర్మాత దిల్‌ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనరుపై 2017లో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ‘శతమానం భవతి’ చిత్రాన్ని ఆయన నిర్మించారు. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం భారీ సినిమాల పోటీని తట్టుకుని నిలబడి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనం చాటింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శతమానం భవతి నెక్ట్స్‌ పేజ్‌’ను రూపొందిస్తున్నట్లు దిల్‌ రాజు ప్రకటించారు. సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామనీ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2025 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామనీ ఆయన వెల్లడించారు.

Updated Date - Jan 17 , 2024 | 06:11 AM