మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sharwa 37: రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో.. శర్వానంద్

ABN, Publish Date - Mar 06 , 2024 | 09:58 PM

శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా #Sharwa37 అనౌన్స్ చేశారు. తన గత సినిమా సామజవరగమన తో సెన్సేషనల్ హిట్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు #శర్వా37కి దర్శకత్వం వహిస్తున్నారు.

Sharwanand 37

హీరో శర్వానంద్ (Sharwanand) కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కి సైన్ అప్ చేస్తున్నారు. తన 35వ చిత్రం 'మనమే' (Manamey) విడుదలకు సిద్ధమౌతుండగా, నెక్స్ట్ తన 36వ సినిమా చేయనున్నారు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా #Sharwa37 అనౌన్స్ చేశారు.

తన గత సినిమా సామజవరగమనతో సెన్సేషనల్ హిట్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు #శర్వా37కి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వానంద్ (Sharwanand) పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. పోస్టర్‌లో సీరియస్‌గా చూస్తున్నారు. #Sharwa37 జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్ గా ఉండబోతుంది. పోస్టర్ ని క్యారికేచర్ గా డిజైన్ చేశారు. హిలేరియస్ రైటింగ్ కి పేరుపొందిన రామ్ అబ్బరాజు, శర్వానంద్‌ను హ్యుమరస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. భాను బోగవరపు కథ అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాత కాగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని మేకర్స్ త్వరలో తెలియజేయ‌నున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:58 PM