వినోదాత్మకంగా ‘మనమే’

ABN , Publish Date - May 25 , 2024 | 06:10 AM

శర్వానంద్‌ నటిస్తున్న 35వ చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌

వినోదాత్మకంగా ‘మనమే’

శర్వానంద్‌ నటిస్తున్న 35వ చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌ జూన్‌ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో శర్వానంద్‌, కృతిశెట్టి విభిన్న పాత్రలలో అలరించనున్నారు. అలాగే విక్రమ్‌ ఆదిత్య కీలక పాత్ర పోషించారు. ‘సినిమాలకు సమ్మర్‌ బిగ్గెస్ట్‌ సీజన్‌. అయితే ఈ ఏడాది వేసవికి డీసెంట్‌ రిలీజులు లేవు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ‘మనమే’ వారిని అలరించే చిత్రం అవుతుంది. ఇందులో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అద్భుతంగా ఉంటుంది’ అని టీమ్‌ వెల్లడించింది. ఈ చిత్రానికి మాటలు: అర్జున్‌ కార్తిక్‌, టాగూర్‌, వెంకీ, సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞానశేఖర్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కృతి ప్రసాద్‌, ఫణి వర్మ,

Updated Date - May 25 , 2024 | 06:10 AM