డిఫరెంట్‌ కథతో ‘షణ్ముఖ’

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:41 AM

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వ హిస్తున్నారు. రమేశ్‌యాదవ్‌, తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు...

డిఫరెంట్‌ కథతో ‘షణ్ముఖ’

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వ హిస్తున్నారు. రమేశ్‌యాదవ్‌, తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా మంగళవారం ఈ చిత్రం టైటిల్‌ లోగోను లాంచ్‌ చేశారు. ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది. అందరినీ తప్పక ఆకట్టుకుంటుంది’’ అన్నారు. దర్శకుడు షణ్ముఖం మాట్లాడుతూ ‘‘డిఫరెంట్‌ కథతో ‘షణ్ముఖ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం 70 శాతం షూటింగ్‌ పూర్తయ్యింది’’ అని చెప్పారు. నిర్మాత రమేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో ఆది చాలా కొత్తగా కనిపిస్తారు’’ అని తెలిపారు.

Updated Date - Apr 10 , 2024 | 01:41 AM