సిద్ధమవుతున్న షణ్ముఖ

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:09 AM

మంచి కథాంశం ఎన్నుకుని ఆసక్తి కలిగించే నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’. ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది...

మంచి కథాంశం ఎన్నుకుని ఆసక్తి కలిగించే నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’. ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ‘శాసన సభ’ చిత్రాన్ని అందించిన సొప్పని బ్రదర్స్‌ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. షణ్ముగం సొప్పని దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఆది సాయికుమార్‌ గెటప్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఆది వెనుక షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుండడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా తెరకు ఎక్కిస్తున్నాం. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం’ అని చెప్పారు. తులసీరామ్‌ సొప్పని, షణ్ముగం సొప్పని, రమేశ్‌ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:09 AM