పురాణ యోధుడి పాత్రలో షాహిద్‌ కపూర్‌

ABN , Publish Date - Mar 20 , 2024 | 05:59 AM

వరుస విజయాలతో జోరుమీదున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌. ఆయన హీరోగా నటించబోయే కొత్త చిత్రం ‘అశ్వత్థామ’ అధికారికంగా ఖరారైంది. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా...

పురాణ యోధుడి పాత్రలో షాహిద్‌ కపూర్‌

వరుస విజయాలతో జోరుమీదున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌. ఆయన హీరోగా నటించబోయే కొత్త చిత్రం ‘అశ్వత్థామ’ అధికారికంగా ఖరారైంది. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా అల్లుకున్న కల్పిత గాథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ మహావీరుడు ఈ కాలానికి ఎలా వచ్చాడు, ఇక్కడున్న దుష్టశక్తులను తుదముట్టించేందుకు ఆయన జరిపిన భారీ పోరాటాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సచిన్‌ రవి దర్శకత్వంలో వసు భగ్నానీ, పూజా ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నాయి. గతంలో విక్కీ కౌశల్‌ కథానాయకుడిగా దర్శకుడు ఆదిత్యధర్‌ ‘అశ్వత్థామ’ ప్రాజెక్ట్‌ను ప్రకటించినా బడ్జెట్‌ పరిమితుల వల్ల వెనక్కు తగ్గారు.

Updated Date - Mar 20 , 2024 | 05:59 AM