మార్చిలో సెట్స్‌పైకి షారుక్‌ చిత్రం

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:23 AM

షారుక్‌ ఖాన్‌ సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘కింగ్‌’. రెడ్‌ చిల్లీస్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో...

షారుక్‌ ఖాన్‌ సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘కింగ్‌’. రెడ్‌ చిల్లీస్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కోసం అంతర్జాతీయ స్టంట్‌ డైరెక్టర్లు పనిచేయన్నుట్లు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Updated Date - Dec 30 , 2024 | 04:23 AM