‘సెట్టవుతుందా పెయిరు’

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:46 AM

రాజ్‌తరుణ్‌, మనీషా కంద్కూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. జె.శివసాయి దర్శకత్వం వహిస్తుండగా, డైరెక్టర్‌ మారుతి సమర్పణలో, ఎన్వీ.కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు...

‘సెట్టవుతుందా పెయిరు’

రాజ్‌తరుణ్‌, మనీషా కంద్కూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. జె.శివసాయి దర్శకత్వం వహిస్తుండగా, డైరెక్టర్‌ మారుతి సమర్పణలో, ఎన్వీ.కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌ అందరినీ అలరించింది. శనివారం ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘సెట్టవుతుందా పెయిరు’ పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కపిల్‌ కపిలన్‌ ఆలపించారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఆర్‌, డీఓపీ: నగేశ్‌ బానెల్లా.

Updated Date - Jun 17 , 2024 | 03:46 AM