‘పడమటి సంధ్యారాగం’ చిత్రానికి సీక్వెల్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:09 AM

విజయశాంతి ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘పడమటి సంధ్యారాగం’. జంధ్యాల దర్శకత్వంలో పూర్తిగా అమెరికా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఆ సినిమా 1987 ఏప్రిల్‌ 11న విడుదలై విజయం సాధించింది. ప్రవాసాంధ్రులు గుమ్మలూరి శాస్త్రి, మీర్‌ అబ్దుల్లా కలసి ఈ సినిమా నిర్మించారు...

‘పడమటి సంధ్యారాగం’ చిత్రానికి సీక్వెల్‌

విజయశాంతి ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘పడమటి సంధ్యారాగం’. జంధ్యాల దర్శకత్వంలో పూర్తిగా అమెరికా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఆ సినిమా 1987 ఏప్రిల్‌ 11న విడుదలై విజయం సాధించింది. ప్రవాసాంధ్రులు గుమ్మలూరి శాస్త్రి, మీర్‌ అబ్దుల్లా కలసి ఈ సినిమా నిర్మించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తుండడం విశేషం. ఆ చిత్ర నిర్మాతలలో ఒకరు, అందులో విజయశాంతి బాబాయిగా నటించిన మీర్‌ అబ్దుల్లా ఈ సీక్వెల్‌ను స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఈ చిత్రం వివరాలను ఆయన చిత్రజ్యోతికి ప్రత్యేకంగా వివరిస్తూ ‘‘పడమటి సంధ్యారాగం’ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉండడమే కాకుండా జంధ్యాలగారి దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలనే ఆలోచన గుమ్మలూరి శాస్త్రిగారికి, నాకూ చాలా కాలంగా ఉంది. ఈ నిర్మాణ సన్నాహాల్లో ఉండగా ఆయన మరణించడంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నాను. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో విజయశాంతి తప్ప మిగిలిన పాత్రలలో దాదాపు అందరూ కొత్తవారే నటించారు. సీక్వెల్‌లో కూడా కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నా. కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తాం. జులైలో చిత్ర నిర్మాణం మొదలు పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాక షూటింగ్‌ తేదీ వెల్లడిస్తా’ అన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 03:09 AM