సీనియర్‌ నటుడు అర్జున్‌ కుమార్తె వివాహం

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:47 AM

సీనియర్‌ నటుడు అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం రాత్రి చెన్నైలో జరిగింది. అర్జున్‌ నిర్మించిన యోగాంజనేయస్వామి దేవాలయంలో...

సీనియర్‌ నటుడు అర్జున్‌ కుమార్తె వివాహం

సీనియర్‌ నటుడు అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం రాత్రి చెన్నైలో జరిగింది. అర్జున్‌ నిర్మించిన యోగాంజనేయస్వామి దేవాలయంలోనే ఈ పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. తమిళ హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి పెళ్లి కొడుకు. కొన్ని తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. ఈ పెళ్లికి విశాల్‌, కార్తి, సముద్రఖని, కె.ఎస్‌.రవికుమార్‌, ఎస్‌.ఆర్‌.ప్రభు, విజయ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - Jun 12 , 2024 | 03:47 AM