Seetharam Sitralu: పెళ్లి, వీసీఆర్ క్యాసెట్స్‌పై అల్లిన కథ.. సీతారాం చిత్రాలు
ABN, Publish Date - Mar 08 , 2024 | 09:46 PM
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. మన పాత రోజులను గుర్తు చేస్తూ...పెళ్లి, వీసీఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథ. ఈ చిత్ర కాన్సెప్ట్ ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు (Seetharam Sitralu). లక్ష్మణ్ (Lakshman), భ్రమరాంబిక (Bramarambika), కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి (Nagasasidhar Reddy) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మన పాత రోజులను గుర్తు చేస్తూ...పెళ్లి, వీసీఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథ సీతారాం చిత్రాలు. ఈ చిత్ర కాన్సెప్ట్ ట్రైలర్‌ను దర్శకుడు మారుతి (Director Maruthi) విడుదల చేశారు.
ఈ సందర్భంగా మారుతి (Director Maruthi) మాట్లాడుతూ.. కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయి. సీతారాం చిత్రాలు (Seetharam Sitralu) టైటిల్, ట్రైలర్, బాగున్నాయి. సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానన్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.