కావాలంటే నన్ను గిచ్చి చూడండి
ABN, Publish Date - Oct 29 , 2024 | 02:02 AM
హీరోయిన్లకు నెటిజన్ల నుంచి ప్లాస్టిక్ సర్జరీ కామెంట్ల రూపంలో ఎదురవుతున్న కొత్త తలనొప్పి రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పైన నెటిజన్లు విమర్శలు చేశారు. అలాగే కెరీర్ ఆరంభంలో...
హీరోయిన్లకు నెటిజన్ల నుంచి ప్లాస్టిక్ సర్జరీ కామెంట్ల రూపంలో ఎదురవుతున్న కొత్త తలనొప్పి రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పైన నెటిజన్లు విమర్శలు చేశారు. అలాగే కెరీర్ ఆరంభంలో నయనతార కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని నెటిజన్లు చేసిన విమర్శలపై నయనతార స్పందించారు. ‘‘నా కనుబొమలు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ రెడ్ కార్పెట్ ఈవెంట్లకు ముందు నా కనుబొమల షేప్‌ను తప్పనిసరిగా మారుస్తుంటాను. కనుబొమల లుక్ మారినప్పుడల్లా ముఖం కొత్తగా కనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది నా ముఖం మారినట్లు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు భావిస్తారు. అయితే అది నిజం కాదు. ఒక్కోసారి డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒకసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి పోయినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా బాడీలో అణువంత కూడా ప్లాస్టిక్ ఉండదు’’ అని నయనతార చెప్పారు.