నటి హేమకు రెండో నోటీసు

ABN , Publish Date - May 30 , 2024 | 12:11 AM

బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీ ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు బుధవారం రెండో నోటీసు జారీ చేశారు...

నటి హేమకు రెండో నోటీసు

బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీ ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు బుధవారం రెండో నోటీసు జారీ చేశారు. ఈ నెల 20న రేవ్‌పార్టీ జరిగింది. పార్టీలో 103 మంది పాల్గొనగా 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. అందులో నటి హేమ కూడా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని హేమకు సీసీబీ అధికారులు గత శనివారం తొలి నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని సీసీబీ ముందు ఆమె సోమవారం హాజరు కావాల్సి ఉన్నా.. వైరల్‌ ఫీవర్‌ కారణంగా రాలేకపోతున్నానని వివరణ ఇచ్చారు. దీంతో రెండో నోటీసు జారీ చేశారు.

బెంగళూరు(ఆంధ్రజ్యోతి)

Updated Date - May 30 , 2024 | 12:11 AM