సందేశాత్మకంగా స్కూల్‌

ABN , Publish Date - May 06 , 2024 | 02:08 AM

ప్రిన్స్‌ నవీద్‌ఖాన్‌, స్నేహా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ది స్కూల్‌’. ‘ప్లేస్‌ ఆఫ్‌ లెర్నింగ్‌’ అనేది ఉపశీర్షిక. వాల్మీకి దర్శకత్వంలో శివ రెమికాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ...

సందేశాత్మకంగా స్కూల్‌

ప్రిన్స్‌ నవీద్‌ఖాన్‌, స్నేహా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ది స్కూల్‌’. ‘ప్లేస్‌ ఆఫ్‌ లెర్నింగ్‌’ అనేది ఉపశీర్షిక. వాల్మీకి దర్శకత్వంలో శివ రెమికాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నవీద్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కథ కూడా అందిస్తున్నాను. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. దర్శకుడు సినిమాను అన్ని వర్గాలను ఆలోచింపజేసేలా తెరకెక్కిస్తున్నారు. అలాగే శివ రెమికాల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’ అని చెప్పారు. తన నట జీవితంలో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందని నటుడు కృష్ణభగవాన్‌ చెప్పారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు తేవాలనే ఆశయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం, మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలి అని నిర్మాత కోరారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నట్లు వాల్మీకి తెలిపారు. ఇంద్రజ, రాజా రవీంద్ర, జబర్దస్త్‌ కార్తీక్‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌ ఠాగూర్‌. ఎడిటింగ్‌: నందమూరి హరి

Updated Date - May 06 , 2024 | 02:09 AM