భయపెడుతూ.. నవ్విస్తూ..

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:51 AM

ఇప్పుడు హారర్‌, కామెడీ చిత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. ఆడియన్స్‌ను నవ్విస్తూ, భయపెడుతూ క్యాష్‌ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆ కోవలో వస్తున్న...

భయపెడుతూ.. నవ్విస్తూ..

ఇప్పుడు హారర్‌, కామెడీ చిత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. ఆడియన్స్‌ను నవ్విస్తూ, భయపెడుతూ క్యాష్‌ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆ కోవలో వస్తున్న మరో చిత్రం ‘మందిర’. ‘ఓ మై ఘోస్ట్‌’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం.గ్లామర్‌ సంచలనం సన్నీ లియోన్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆర్‌. యువన్‌ దర్శకత్వంలో సాయి సుధాకర్‌ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జులై 19న విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సన్నీ లియోన్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated Date - Jun 25 , 2024 | 12:51 AM