భయపెట్టే రారాజా

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:54 AM

సుగి విజయ్‌, మౌనిక మగులూరి హీరో హీరోయిన్లుగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘రారాజా’. శ్రీ పద్మిని సినిమాస్‌ బేనర్‌పై బి. శివప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ను...

భయపెట్టే రారాజా

సుగి విజయ్‌, మౌనిక మగులూరి హీరో హీరోయిన్లుగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘రారాజా’. శ్రీ పద్మిని సినిమాస్‌ బేనర్‌పై బి. శివప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రధాన పాత్రధారి మొహం కనిపించకుండా డిజైన్‌ చేసిన కాన్సెప్ట్‌ ఆసక్తికరంగా ఉంది. హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. త్వరలోనే ‘రారాజా’ విడుదల తేదీని ప్రకటిస్తామని శివ ప్రసాద్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీ వాత్సవ్‌.

Updated Date - Jun 29 , 2024 | 03:54 AM