Karthi: కథ విన్నప్పుడు వచ్చిన అనుమానం అది

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:19 PM

కొత్త కాన్సెప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిజమైంది’’ అని కార్తీ (KArthi) అన్నారు.

'సత్యం సుందరం’ (Satyam Sundaram) తరహా చిత్రాలను కె.విశ్వనాథ్‌, బాలచందర్‌, దాసరి నారాయణరావు లాంటి వాళ్లు ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మెప్పించారు. ఈ కథ వినగానే ఇలాంటి సినిమాను చూస్తారా అని అనుమానం వచ్చింది. కానీ, కొత్త కాన్సెప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిజమైంది’’ అని కార్తీ (KArthi) అన్నారు. ఆయనతోపాటు అరవింద్‌ స్వామి కీలక పాత్రధారులుగా సి.ప్రేమ్‌కుమార్‌ (C Prem kumar) దర్శకత్వం వహించిన చిత్రం 'సత్యం సుందరం’. గత శనివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా సాధిస్తున్న విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర బృందం మంగళవారం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటుచేశారు. 

‘‘ఇది సక్సెస్‌మీట్‌లా లేదు. ఫ్యామిలీ ఫంక్షన్‌లా ఉంది. తెలుగు ప్రేక్షకులు చాలామంది నాకు ఫోన్‌ చేశారు. సినిమా నచ్చి ప్రేక్షకులు చెబుతున్న మాటలకు భావోద్వేగానికి గురయ్యాను. కె.విశ్వనాథ్‌, బాల చందర్‌, దాసరి నారాయణరావు లాంటి వాళ్లు ఇలాంటి సినిమాలను ఎప్పుడో తెరకెక్కించి మెప్పించారు. ఈ కథ వినగానే ఇలాంటి సినిమాను చూస్తారా అని అనుమానం వచ్చింది. కానీ, కొత్త కాన్సెప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిజమైంది. ఎంతోమంది ఫోన్‌ చేసి ఎమోషనల్‌ అవుతుంటే చాలా ఆనందంగా ఉంది. కమర్షియల్‌గా కూడా ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి. మంచి సినిమా కమర్షియల్‌గా కూడా విజయం సాధిస్తే నిర్మాతలకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ తరహా చిత్రాలు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వందమంది వచ్చి నన్ను కౌగిలించుకొని అభినందనలు తెలుపుతున్నట్లు ఉంది. ఇంతకుమించి మాట్లాడితే నేను ఎమోషనల్‌ అవుతాను’ అని కార్తి అన్నారు.

ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ "నా కెరీర్‌ తెలుగు ఇండస్ట్రీతోనే మొదలైంది. సత్యం సుందరం చిత్రంతో మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.


Updated Date - Oct 01 , 2024 | 03:20 PM