సత్యభామ ప్రేమగీతం

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:24 AM

కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో ఆమె శక్తిమంతమైన పోలీస్‌ అధికారిణిగా కనిపించనున్నారు..

సత్యభామ ప్రేమగీతం

కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో ఆమె శక్తిమంతమైన పోలీస్‌ అధికారిణిగా కనిపించనున్నారు. నవీన్‌చంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. సుమన్‌ చిక్కాల దర్శకుడు. మే 17న ‘సత్యభామ’ చిత్రం విడుదలవుతోంది. గురువారం ఈ చిత్రం నుంచి ‘కళ్లారా చూశాలే నువ్వేనా’ అంటూ సాగే తొలి పాటను యూనిట్‌ విడుదల చేసింది. కాలేజీ ప్రేమ నేపథ్యంలో సాగే ఈ గీతానికి రాంబాబు గోసాల సాహిత్యం అందించగా శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించారు. శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బి విష్ణు.

Updated Date - Apr 26 , 2024 | 06:24 AM