కొత్త తేదీన సత్యభామ

ABN , Publish Date - May 24 , 2024 | 03:15 AM

కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘సత్యభామ’. ఇందులో ఆమె శక్తిమంతమైన పోలీసాఫీసర్‌ పాత్ర పోషించారు. ఈ చిత్రం విడుదల కొత్త తేదీకి మారింది. జూన్‌ 7న ‘సత్యభామ’ను...

కొత్త తేదీన సత్యభామ

కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘సత్యభామ’. ఇందులో ఆమె శక్తిమంతమైన పోలీసాఫీసర్‌ పాత్ర పోషించారు. ఈ చిత్రం విడుదల కొత్త తేదీకి మారింది. జూన్‌ 7న ‘సత్యభామ’ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం గురువారం ప్రకటించింది. నవీన్‌ చంద్ర కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. దర్శకుడు శశికిరణ్‌ తిక్క స్ర్కీన్‌ప్లే అందించడంతో పాటు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల. సినిమాటోగ్రఫీ: బి విష్ణు

Updated Date - May 24 , 2024 | 03:15 AM