సహజత్వానికి దగ్గరగా సత్య

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:18 AM

అమరేశ్‌, ప్రార్థన సందీప్‌ జంటగా నటించిన ‘రంగోలి’ తమిళ చిత్రం ‘సత్య’ పేరుతో తెలుగులో వస్తోంది. వాలి మోహన్‌దా్‌స దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శివ మల్లాల తెలుగులో విడుదల చేస్తున్నారు...

సహజత్వానికి దగ్గరగా సత్య

అమరేశ్‌, ప్రార్థన సందీప్‌ జంటగా నటించిన ‘రంగోలి’ తమిళ చిత్రం ‘సత్య’ పేరుతో తెలుగులో వస్తోంది. వాలి మోహన్‌దా్‌స దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శివ మల్లాల తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో టీజర్‌, పాట విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వాలి మోహన్‌దా్‌స మాట్లాడుతూ ‘ఇదే నా మొదటి సినిమా. నాకు ఎదురైన సంఘటనల నుంచి పుట్టిన కథతో సినిమా రూపుదిద్దుకుంది’ అని తెలిపారు. ‘సినిమాలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా కొత్త వారే. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి సహజత్వానికి దగ్గరగా సినిమా ఉంటుంది’ అని సంభాషణల రచయిత విజయ్‌కుమార్‌ చెప్పారు. హీరో అమరేశ్‌ మాట్లాడుతూ ‘తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ‘ఈ సినిమాను చాలా మంది నిర్మాతలు తెలుగులో చేస్తామని అడిగినా నా మీద అభిమానంతో నాకు ఇచ్చిన తమిళ నిర్మాత సతీశ్‌కు కృతజ్ఞతలు. ఎన్నో సినిమాలకు రివ్యూలు రాసిన నేను కచ్చితంగా మీ ముందుకు ఓ మంచి సినిమాతోనే వస్తున్నాను’ అని నిర్మాత శివ మల్లాల చెప్పారు. తమిళ నిర్మాత సతీశ్‌ మాట్లాడుతూ ‘ విక్రమ్‌ హీరోగా నటించిన ‘నాన్న’ సినిమాలో చైల్డ్‌ ఆర్టి్‌స్టగా హమరేశ్‌ నటించాడు. నటన అంటే ఎంతో ప్యాషన్‌ అతనికి. అందుకే అతను హీరోగా ‘రంగోలి’ చిత్రాన్ని నిర్మించాను, మంచి హిట్‌ అయింది. తెలుగులో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 03:18 AM