శనివారం సూర్య వేట

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:38 AM

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న విడుదలవుతోంది...

శనివారం సూర్య వేట

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న విడుదలవుతోంది. శనివారం నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. సూర్య అనే పాత్రలో నాని స్లైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఆయన పాత్రను మలచిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక.

సుజీత్‌ దర్శకత్వంలో

అలాగే నాని నటించే తదుపరి చిత్రాన్ని పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. ‘సాహో’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 02:38 AM