గురువారం వస్తున్న శనివారం

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:54 AM

నాని విభిన్న రకాల షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు...

నాని విభిన్న రకాల షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 29 గురువారం నాడు పాన్‌ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఇప్పటికీ విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. గురువారం ఈ సినిమా నుంచి నాని పోషిస్తున్న క్యారెక్టర్‌ నుంచి మరో లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇది వరకు రిలీజైన పోస్టర్స్‌లో యాంగ్రీ లుక్‌లో కనపడిన నాని.. ఈ పోస్టర్‌లో మాత్రం బైక్‌ నడుపుతూ చాలా కూల్‌ లుక్‌లో పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌, డీఓపీ: మురళి.జి

Updated Date - Jul 05 , 2024 | 12:54 AM