నిర్మాతగా సంతృప్తినిచ్చింది

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:04 AM

అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్‌రెడ్డి’ చిత్రం చక్కటి ఆదరణతో కొనసాగుతోన్న సందర్భంగా చిత్రబృందం శనివారం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మదన్‌ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ...

అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్‌రెడ్డి’ చిత్రం చక్కటి ఆదరణతో కొనసాగుతోన్న సందర్భంగా చిత్రబృందం శనివారం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మదన్‌ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘లవ్‌రెడ్డి సినిమా చూస్తున్న ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరొచ్చింది. నిర్మాతకు నాకు సంతృప్తినిచ్చింది. ప్రేక్షకులు మరింతగా మా చిత్రాన్ని ఆదరించాలి’ అని కోరారు. దర ్శకుడు స్మరణ్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రచారానికి తగినంత సమయం దొరక్కపోయినా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకు చేరువైంది. ప్రతి ఒక్కరూ మంచి సినిమా తీశారని ప్రశంసిస్తున్నారు’ అని చెప్పారు. రాతిగుండెను సైతం కరిగించేలా క్లైమాక్స్‌ ఉందని ప్రేక్షకులు చెబుతున్నారని శ్రావణి తెలిపారు. ‘లవ్‌రెడ్డి’ థియేటర్లలో గెలిచాడు అని అంజన్‌ రామచంద్ర తెలిపారు.

Updated Date - Oct 20 , 2024 | 02:04 AM