సంతృప్తినిచ్చింది

ABN , Publish Date - Oct 08 , 2024 | 02:12 AM

ఇటీవలే ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు సుధీర్‌బాబు. తాజాగా అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘‘నా నాన్న సూపర్‌హీరో’’. సునీల్‌ బలుసు నిర్మించారు...

ఇటీవలే ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు సుధీర్‌బాబు. తాజాగా అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘‘నా నాన్న సూపర్‌హీరో’’. సునీల్‌ బలుసు నిర్మించారు. సాయిచంద్‌, షాయజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సుధీర్‌బాబు మీడియాతో ముచ్చటించారు.

‘‘ఇది బలమైన సంఘర్షణతో నిండిన కథ. ఇద్దరు తండ్రులు.. ఓ కొడుకు మధ్య జరిగే ఆసక్తి కరమైన సినిమా అని చెప్పొచ్చు. ఇందులోని ప్రతీ సన్నివేశం ఎంతో లోతుగా ఉంటుంది. మానవ సంబంధాల మీద అరుదుగా కొన్ని సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమా ఆ కోవకు చెందినదే. ఇందులో నటీనటుల నటన నుంచి కెమెరా యాంగిల్స్‌ వరకు ప్రతీది సహజంగా ఉండేలా దర్శకుడు కేర్‌ తీసుకున్నారు. సాయిచంద్‌, షాయాజీ షిండేలతో నటించడం మంచి వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. సంగీత దర్శకుడు జైక్రిష్‌ అద్భుతమైన పాటలను ఇచ్చారు.


ఇందులో ఉండే లవ్‌ ట్రాక్‌, స్టోరీని పక్కదారి పట్టనీయకుండా సందర్భానుసారం ఉంటుంది. ఇది పక్కా ఫ్యామిలీ చిత్రం. అవుట్‌పుట్‌ చూశాను. చాలా బాగా వచ్చింది. అందరికీ తప్పక నచ్చుతుంది. నేను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో అత్యంత సంతృప్తిని ఇచ్చిన చిత్రమిదే. ప్రస్తుతం ‘జటాధర’ ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతోంది. నా కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అని చెప్పారు.

Updated Date - Oct 08 , 2024 | 02:12 AM