శశివదనుడి ప్రేమగీతం

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:42 AM

రక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న...

శశివదనుడి ప్రేమగీతం

రక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రం నుంచి యూనిట్‌ మరో పాటను విడుదల చేసింది. ‘గోదారి అటువైపో నాదారి ఇటువైపో అమ్మాయి నీదారెటువైపో’ అంటూ సాగే గీతాన్ని గురువారం మేకర్స్‌ విడుదల చేశారు. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా, అనుదీప్‌దేవ్‌ స్వరాలు అందించడంతో పాటు ఆలపించారు. ఈ చిత్రంలో శ్రీమన్‌, దీపక్‌ ప్రిన్స్‌, రంగస్థలం మహేశ్‌ కీలకపాత్రలు పోషించారు.

Updated Date - Mar 29 , 2024 | 03:42 AM