సరికొత్తగా ఉంటుంది

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:47 AM

‘ఓం శాంతి’ సినిమాతో దర్శకుడిగా మారి.. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ‘యేవమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రకాశ్‌ దంతులూరి. చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్‌, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో ...

సరికొత్తగా ఉంటుంది

‘ఓం శాంతి’ సినిమాతో దర్శకుడిగా మారి.. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ‘యేవమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రకాశ్‌ దంతులూరి. చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్‌, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నవదీప్‌, గోపరాజు నిర్మాతలు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగాప్రకాశ్‌ దంతులూరి మీడియాతో ముచ్చటించారు. ‘‘యేవమ్‌’ అనేది సంసృత పదం. ఇతిహాసాలు, పురాణాల్లో.. ఇది ఇలా జరిగింది అని చెప్పడానికి ఈ పదం వాడతారు. నలుగురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. ఇందులో చాందిని పాత్ర పేరు సౌమ్య. ఆ పాత్రలో ఆమె లీనమై నటించారు. ఇందులోని ప్రతీ పాత్ర తీరు సరికొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ప్రతీ సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధానాకర్షణ. థియేటర్స్‌లో చూసే ప్రేక్షకులకు ఒక్క క్షణం కూడా బోర్‌ కొట్టని విధంగా సినిమా ఉంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Jun 13 , 2024 | 04:47 AM