Chaithra J Achar: స‌ప్త‌సాగ‌రాలు దాటి హీరోయిన్ అరాచ‌కం.. ఏకంగా ఆ డ్రెస్‌లో షూట్‌

ABN , Publish Date - Mar 13 , 2024 | 04:34 PM

స‌ప్త‌సాగ‌రాలు దాటి సైడ్ బీ చిత్రం ద్వారా వెలుగులోకి వ‌చ్చిన క‌న్న‌డ భామ చైత్ర ఆచార్. ఇప్ప‌టివ‌ర‌కు చేసింది ఐదారు సినిమాలే అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తాజాగా కేవ‌లం బ్రాలో ఫొటో షూట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

Chaithra J Achar: స‌ప్త‌సాగ‌రాలు దాటి హీరోయిన్ అరాచ‌కం.. ఏకంగా ఆ డ్రెస్‌లో షూట్‌
chitra achar

స‌ప్త‌సాగ‌రాలు దాటి సైడ్ బీ చిత్రం ద్వారా వెలుగులోకి వ‌చ్చిన క‌న్న‌డ భామ చైత్ర ఆచార్ (Chaithra Achar). చూడ‌డానికి మ‌న ప‌క్కింటి అమ్మాయిలా.. గ‌ర్ట్ నెక్స్ట్ డోర్ అన్న‌ట్టుగా ఉండే ఈ భామ.. ప్రైవేట్ లైఫ్‌లో మాత్రం అందుకు చాలా భిన్నం.

chitra 15.jpeg

ఓ రేంజ్‌లో గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ చూసేవారిని ఖంగు తినేలా చేయ‌డం ఖాయం. ఇదేంద‌య్యా ఇది నేనెప్పుడు చూడ‌లా.. మనం చూస్తున్న‌ది నిజ‌మేనా అని అనుకోక‌కుండా ఉండ‌లేం. అంత‌లా అమ్మ‌డి అందాల విందు ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది.

chitra 14.jpeg

తాజాగా కేవ‌లం బ్రాలో ఫొటో షూట్ చేసి కుర్ర‌కారులో మ‌రింత వేడిని పెంచుతోంది. ప్రతి రోజు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో వేడి పెంచుతోంది.

chi3.jpg

ఇప్ప‌టికే స‌ప్త సాగ‌రాలు (Sapta Sagaralu Dhaati (Side B) సినిమాలో లిప్‌లాక్‌లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత చాలా అవార్డ్ ఫంక్ష‌న్ల‌లో త‌న అల్ట్రా మోడ్ర‌న్ డ్రెస్సుల‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేసింది.

chi4.jpg

2019లో మ‌హిరా (Mahira) అనే చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అన‌తి కాలంలోనే త‌న మ‌ల్టీ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంగీతం మీద మ‌క్కువ‌తో గాయ‌నిగా స్థిర ప‌డాల‌ని వ‌చ్చిన చైత్ర అనుకోకుండా న‌టిగా పేరు తెచ్చుకుని క‌థానాయిక‌గా సెటిల్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 6 సినిమాలు మాత్ర‌మే చేసిన ఈ చిన్న‌ది ఫ్లే బ్యాక్ సింగ‌ర్ గా ఓ 10 పాటలు పాడింది.

chitra 16.jpeg


2023లో విడుద‌లైన రెండు చిత్రాలు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty) స‌ప్త‌సాగ‌రాలు దాటి సైడ్ బీ (Sapta Sagaralu Dhaati (Side B) ), రాజ్ బీ శెట్టి (Raj B. Shetty) టోబీ (Toby) సినిమాల‌తో ఒక్క‌సారిగా వెలుగులోకి రావడమేగాక ఆ చిత్రాల‌తో విల‌క్ష‌ణ న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాలో వేశ్య‌గా న‌టించి మెప్పించ‌గా టోబీ సినిమాలో తండ్రిని కాపాడే ఓ ప‌ల్లెటూరు కూతురిగా అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

chi2.jpg

తాజాగా చైత్ర‌ ఈ సంవ‌త్స‌రం తెలుగులో ద‌స‌రా చిత్రంలో నాని మిత్రుడిగా చేసిన దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty)తో జంట‌గా న‌టించిన బ్లింక్ అనే క‌న్న‌డ‌ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి సాధించింది.

chitra 7.jpeg

ప్ర‌స్తుతం మ‌రో నాలుగైదు చిత్రాలలో న‌టిస్తోండగా వేరే ఇత‌ర భాషల్లో సినిమాల‌కు సైన్ చేయ‌లేదు. మీరింతవరకు ీ ముద్దుగుమ్మ ఫొటోలు చూడలేదా.. ఇంకెందుకు ఆల‌స్యం. మీరూ వాటిని చూసి ఆస్వాదించండి మ‌రి.

chi 12.jpg

Updated Date - Mar 13 , 2024 | 04:55 PM