Sankranthiki Vasthunam: ‘గోదారి గట్టు’.. రమణ గోగుల పాడిన పాట రిలీజ్‌కు డేట్ ఫిక్స్
ABN , Publish Date - Nov 27 , 2024 | 08:07 PM
రాబోయే సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రమణ గోగుల పాడిన ఈ పాటను ఎప్పుడు విడుదల చేయబోతున్నారంటే..
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో టాలెంటెడ్ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రమణ గోగుల చాలా రోజుల తర్వాత ఓ పాటను ఆలపించినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయమూ తెలిసిందే. ఈ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ ఓ న్యూ పోస్టర్‌తో రివీల్ చేశారు.
Also Read-సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కమ్ బ్యాక్‌ని తెలియజేస్తోంది. ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. ఈ పోస్టర్ విషయానికి వస్తే.. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటీఫుల్ మూమెంట్, వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో అందంగా కనిపిస్తుండగా.. అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్‌ని ఈ జంట ఆస్వాదిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
హీరో వెంకటేష్, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నారు.