సందీప్‌కిషన్‌ 30వ చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:28 AM

‘ఊరి పేరు బైరవకోన’ చిత్రం తర్వాత హీరో సందీప్‌కిషన్‌ నటించే కొత్త చిత్రం షూటింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇది ఆయనకు 30వ సినిమా....

సందీప్‌కిషన్‌ 30వ చిత్రం ప్రారంభం

‘ఊరి పేరు బైరవకోన’ చిత్రం తర్వాత హీరో సందీప్‌కిషన్‌ నటించే కొత్త చిత్రం షూటింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇది ఆయనకు 30వ సినిమా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. దర్శకుడు విజయ్‌ కనకమేడల కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, సందీప్‌కిషన్‌ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు దిల్‌ రాజు క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో రావు రమేశ్‌ కీలక పాత్ర పోషించనున్నారు. త్వరలోనే రెగ్గులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకొనే ఈ సినిమాకు ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. నిజార్‌ షఫీ డీవోపి. బాలాజీ గుత్తా సహ నిర్మాత.

Updated Date - Apr 24 , 2024 | 05:28 AM