ఎస్‌కే 30 షురూ

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:28 AM

ఇప్పటిదాకా లవ్‌స్టోరీలు, మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైన ర్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్‌ కిషన్‌ తన పంథా మార్చారు. తన కెరీర్‌లో చేయని సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు...

ఎస్‌కే 30 షురూ

ఇప్పటిదాకా లవ్‌స్టోరీలు, మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైన ర్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్‌ కిషన్‌ తన పంథా మార్చారు. తన కెరీర్‌లో చేయని సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న 30వ చిత్రం (ఎస్‌కే 30)లో ఓ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు చుట్టూ అల్లుకున్న కథ ఇది. బుధవారం ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పలు బ్లాక్‌బస్టర్‌ ఎంటర్టైన ర్‌లను అందించిన త్రినాథరావు నక్కిన ‘ఎస్‌కే 30’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, హాస్య మూవీస్‌, జీ స్టూడియోస్‌ కలయికలో రాజేశ్‌ దండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రావు రమేశ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. లియోన్‌ జేమ్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. డీవోపీ: నిజార్‌ షఫీ. ఎడిటర్‌: చోటా కే ప్రసాద్‌. బాలాజీ గుత్తా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 02:28 AM