మత్య్సకారుల కథతో ‘సముద్రుడు’

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:04 AM

రమాకాంత్‌, అవంతికి, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సముద్రుడు’. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో బదావత్‌ కిషన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం...

మత్య్సకారుల కథతో ‘సముద్రుడు’

రమాకాంత్‌, అవంతికి, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సముద్రుడు’. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో బదావత్‌ కిషన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం టీజర్‌ను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన సినిమా ఇది. కేటీఆర్‌గారు మా చిత్రం టీజర్‌ను ఆవిష్కరించి, ఓ సామాజిక అంశాన్ని కమర్షియల్‌ హంగులతో సినిమాగా తీయడం అభినందనీయం అన్నారు. మే 3న మా సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. హీరో రమాకాంత్‌ మాట్లాడుతూ ‘అన్ని కమర్షియల్‌ అంశాలతో సినిమా రూపుదిద్దుకుంది. అందరూ చూసి అభినందిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు. సుమన్‌, శ్రవణ్‌, రామరాజు, రాజ్‌ ప్రేమి, సమ్మెట గాంధీ, ప్రభావతి, జబర్ధస్త్‌ శేషు, చిత్రం శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి.

Updated Date - Feb 09 , 2024 | 03:04 AM