సమంత టేక్ 20 Samantha tek 20
ABN , Publish Date - Feb 16 , 2024 | 05:40 AM
అగ్రకథానాయికగా కెరీర్ జోరు మీదున్న సమయంలో మయోసైటిస్ వ్యాధి బారినపడి సినిమాలకు దూరమయ్యారు సమంత. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్స్‌లో పాల్గోనున్నట్లు...

అగ్రకథానాయికగా కెరీర్ జోరు మీదున్న సమయంలో మయోసైటిస్ వ్యాధి బారినపడి సినిమాలకు దూరమయ్యారు సమంత. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్స్‌లో పాల్గోనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మయోసైటిస్ వల్ల తను ఎదుర్కొన్న ఇబ్బందులు, దాన్ని అధిగమించేందుకు అనుసరించిన పద్ధతులపై అభిమానులకు అవగాహన కల్పించేందుకు సమంత సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన పాడ్‌కాస్ట్‌ను ‘టేక్ 20’ పేరుతో ఈనెల 19న విడుదల చేయబోతున్నారు. గురువారం ప్రోమోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్‌చే శారు. ‘టేక్ 20 అనే పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించాను. ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను మాత్రమే మీతో పంచుకుంటాను. మన జీవితాలను మరింత మెరుగ్గా మార్చుకుందాం. మీరూ మాతో జాయిన్ అవ్వండి’ అని సమంత నెటిజన్లను కోరారు.