బబ్బర్‌షేర్‌గా సల్మాన్‌?

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:56 AM

సల్మాన్‌ఖాన్‌, కబీర్‌ఖాన్‌ మళ్లీ కలవనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో భజరంగీ భాయ్‌జాన్‌, ఏక్తాటైగర్‌, ట్యూబ్‌లైట్‌ చిత్రాలు రూపొందాయి. వీటిలో మొదటిరెండూ బ్లాక్‌బాస్టర్స్‌ కాగా, ‘ట్యూబ్‌లైట్‌’ మాత్రం...

బబ్బర్‌షేర్‌గా సల్మాన్‌?

సల్మాన్‌ఖాన్‌, కబీర్‌ఖాన్‌ మళ్లీ కలవనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో భజరంగీ భాయ్‌జాన్‌, ఏక్తాటైగర్‌, ట్యూబ్‌లైట్‌ చిత్రాలు రూపొందాయి. వీటిలో మొదటిరెండూ బ్లాక్‌బాస్టర్స్‌ కాగా, ‘ట్యూబ్‌లైట్‌’ మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. త్వరలో మళ్లీ సల్మాన్‌ని డైరెక్ట్‌ చేయనున్నారు కబీర్‌ఖాన్‌. ఈ కథకు ‘బబ్బర్‌షేర్‌‘ అని టైటిల్‌ని కూడా ఫిక్స్‌ చేశారాయన. ఈ కథ గురించి బాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఊహకందని కథాకథనాలతో ఈ స్ర్కిప్ట్‌ని కబీర్‌ రెడీ చేశారని సమాచారం. దాంతో చాలామంది హీరోలు ఈ ప్రాజెక్ట్‌ని సొంతం చేసుకోడానికి ప్రయత్నాలు చేశారని వినికిడి. అయితే.. కబీర్‌ఖాన్‌ మాత్రం తన మనసులో ఆ కథకు వేరొకర్ని కథానాయకుడిగా ఊహించలేకపోతున్నారట. అందుకే.. ఎవరు ఎంత ప్రయత్నించినా తను మాత్రం సల్మాన్‌ కోసమే వెయిట్‌ చేశారట. గత ఏడాది అగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు సల్మాన్‌, కబీర్‌ల మధ్య జరిగాయని వినికిడి. ఈ నెల చివరికల్లా బౌండెడ్‌ స్ర్కిప్ట్‌తో సల్మాన్‌ని ఆయన కలవనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - Jan 05 , 2024 | 06:56 AM