శేఖర్‌ కమ్ముల చేతుల మీదుగా...

ABN , Publish Date - Jul 07 , 2024 | 05:47 AM

సాయితేజ కల్వకోట, పావని కరణమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పైలం పిలగా’. తెలంగాణ నేపధ్యంలో సాగే ఈ హాస్యభరిత వ్యంగ్య చిత్రాన్ని యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ ఆనంద్‌ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొదుల నిర్మించారు.

సాయితేజ కల్వకోట, పావని కరణమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పైలం పిలగా’. తెలంగాణ నేపధ్యంలో సాగే ఈ హాస్యభరిత వ్యంగ్య చిత్రాన్ని యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ ఆనంద్‌ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొదుల నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘సోడు సోడు’ పాటను డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘ఈ పాటకు మంచి సాహిత్యంతో పాటు ఆకట్టుకునే సంగీతం తోడైంది’ అని చెప్పారు. ‘పూర్తి స్థాయి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది’’ అని నిర్మాత రామకృష్ణ బొదుల తెలిపారు. ఈ పాటకు ఆనంద్‌ గుర్రం, అక్కల చంద్రమౌళి సాహిత్యం అందించగా, యశ్వంత్‌ నాగ్‌నారు సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: రవితేజ కుర్మన, డీఓపీ: సందీప్‌ బొద్దుల.

Updated Date - Jul 07 , 2024 | 05:47 AM