సినిమా మీద నమ్మకంతోనే అలా చెప్పా
ABN , Publish Date - Oct 04 , 2024 | 01:16 AM
‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌గోపాల్ వర్మగారు హీరో క్వాలీటీస్ ఉన్నాయని నా గురించి చెప్పడం సంతోషంగా ఉంది. ‘ఈ సినిమాకు మీకు నచ్చకపోతే టికెట్‌ను ఫొటో తీస ఇన్‌స్టా ద్వారా పంపండి. డబ్బులు తిరిగి ఇచ్చేస్తా’ అని ఆ వేదిక మీద చెప్పా...
‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌గోపాల్ వర్మగారు హీరో క్వాలీటీస్ ఉన్నాయని నా గురించి చెప్పడం సంతోషంగా ఉంది. ‘ఈ సినిమాకు మీకు నచ్చకపోతే టికెట్‌ను ఫొటో తీస ఇన్‌స్టా ద్వారా పంపండి. డబ్బులు తిరిగి ఇచ్చేస్తా’ అని ఆ వేదిక మీద చెప్పా. సినిమా మీద నమ్మకంతో నే అలా చెప్పా’ అన్నారు కొత్త హీరో చంద్రహాస్. తను నటించిన ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో నేను పరిచయం కావడం ఆనందంగా ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎగ్జైటింగ్‌గా ఉంది. సినిమా బాగా రావడంతో ఆందరం కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం’ అన్నారు. ‘సినిమాలో సూపర్‌హీరోగా కనిపించను, ఒక సాధారణ యువకుడిగాలా జీవన పోరాటం చేస్తుంటాను. సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. ఎలాంటి అసభ్యత లేదు. ఫ్యామిలీతో కలసి చూడొచ్చు. ఈ సినిమాను మా నాన్న ప్రభాకర్ నిర్మించారు.
ఎన్నుకున్న కథను మనం అనుకున్నట్లు తీయాలంటే సొంతంగా తీయడమే బెటర్ అని ఆయన భావించారు. ఆయన కూడా అనుకోకుండా ఓ చిన్న పాత్ర పోషించారు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ నన్ను స్ర్కీన్ మీద బాగా ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటి వివరాలు త్వరలో తెలుపుతా’ అన్నారు చంద్రహాస్.