Pranaya Godari: ‘ప్రణయగోదారి’లో ఫెరోషియ‌స్ లుక్‌లో డైలాగ్ కింగ్..

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:39 PM

పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో హాస్య‌న‌టుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘ప్రణయగోదారి’. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం ఈ చిత్రానికి సంబంధించిన సాయికుమార్ ఫస్ట్ లుక్‌ పోస్ట‌ర్‌ను తెలంగాణ శాస‌న‌స‌భ్యులు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేశారు.

Sai Kumar Look From Pranaya Godari Launched

ఎటువంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించి, ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి, వాటికి జీవం పోసే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. త్వ‌ర‌లో ఆయ‌న మ‌రో ఫెరోషియ‌స్ పాత్ర‌తో ఆడియ‌న్స్‌ను స‌ర్‌ఫ్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ‘ప్ర‌ణ‌య‌గోదారి’ (Pranaya Godari)లో సాయికుమార్ (Sai Kumar) పెద‌కాపు అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హాస్య‌న‌టుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ (Sadan) హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ (Priyanka Prasad) హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం ఈ చిత్రానికి సంబంధించిన సాయికుమార్ ఫస్ట్ లుక్‌ (Sai Kumar First Look) పోస్ట‌ర్‌ను తెలంగాణ శాస‌న‌స‌భ్యులు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (MLA Komatireddy Raj Gopal Reddy) విడుద‌ల చేశారు.

Also Read-Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..

సాయి కుమార్ లుక్ విషయానికి వస్తే.. చూడ‌గానే గంభీరంగా క‌నిపించే లుక్‌లో.. రౌద్రంగా క‌నిపంచే మీస‌క‌ట్టు, తెల్ల‌ని పంచె, లాల్చీతో, మెడ‌లో రుద్రాక్ష‌మాల‌, చేయికి కంక‌ణంతో.. చేతిలో సిగార్‌తో చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు సాయికుమార్‌. ఈ పోస్ట‌ర్‌ను చూస్తే చిత్రంలో ఆయ‌న పాత్ర శ‌క్తివంతంగా ఉండబోతుందనేది అర్థమవుతోంది. ఈ పోస్టర్ విడుదల అనంతరం కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మా మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమ‌ళ్ళ లింగ‌య్య ‘ప్ర‌ణ‌య‌గోదారి’ అనే ఓ మంచి సినిమాను నిర్మించినందుకు అభినంద‌న‌లు. సినిమా రంగంలో ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. పారుమ‌ళ్ళ లింగయ్యకు నా స‌హ‌కారం ఎప్పుడూ వుంటుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మంచి విజ‌యం సాధించాల‌ని ఆశిస్తూ.. భ‌విష్య‌త్‌లో లింగయ్య ఇలాంటి సినిమాలు మ‌రిన్ని నిర్మించాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. (Pranaya Godari Movie)


Pranaya-Godari-Movie.jpg

చిత్ర ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ.. మా సినిమా నుంచి సాయికుమార్ లుక్‌ను విడుద‌ల చేసి, మా కంటెంట్‌ను మెచ్చుకొని అభినందించి, శుభాకాంక్ష‌లు తెలిపిన మునుగోడు ఎమ్మేల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి మా యూనిట్ త‌ర‌పున కృత‌జ్ఞత‌లు తెలియ‌జేస్తున్నాం. ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అన్ని వ‌ర్గాల వారిని అల‌రించే అంశాలున్నాయి. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్‌లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో చక్కగా చూపించాం. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంద‌నే న‌మ్మ‌కం వుంది. అతి త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్ర‌క‌టిస్తామన్నారు.

Read Latest Cinema News

Pranaya-Godari.jpg

Updated Date - Jul 05 , 2024 | 04:41 PM