కీలకంగా సాహూ పాత్ర

ABN, Publish Date - Oct 20 , 2024 | 02:18 AM

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా కరుణ కుమార్‌ దర ్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మట్కా’. డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. నవంబర్‌ 14న ఈ చిత్రం విడుదలవుతోంది...

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా కరుణ కుమార్‌ దర ్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మట్కా’. డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. నవంబర్‌ 14న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర సాహూ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ శనివారం చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నవీన్‌చంద్ర స్కూటర్‌పై కూర్చొని తీక్షణంగా చూస్తున్న లుక్‌ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలు. సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌. సినిమాటోగ్రఫీ: ఏ కిశోర్‌కుమార్‌.

Updated Date - Oct 20 , 2024 | 02:18 AM